
558views
-
ఆఫ్రికాకు ఎలాంటి సంబంధం లేదు
-
అనవసర విషప్రచారంతో ఆఫ్రికా దేశాలకు చెడ్డపేరు
-
బోట్స్వనా అధ్యక్షుడు ఆవేదన
బోట్స్వానా: ఒమిక్రాన్ వేరియంట్ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ యూరప్ నుంచి వచ్చిన రాయబారుల్లోనే మొదట దాన్ని గుర్తించామని బోట్స్వానా అధ్యక్షుడు మోగ్విటీ మాసిసి వెల్లడించారు. బోట్సోవానాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్.. డెల్టాతో పోలిస్తే భిన్నంగా ఉందని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అందులోని స్పైక్ ప్రొటీన్లలో మ్యుటేషన్లు ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు.
వెంటనే ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేశాం.. వీటిని విశ్లేషించిన డబ్ల్యూహెచ్‌ఓ ఈ కొత్త వేరియంట్‌ను ఆందోళనకరంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆఫ్రికా దేశాలపై ఆంక్షలు మొదలుపెట్టాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బోట్స్‌వానా అధ్యక్షుడు తెలిపారు. అసలు ఈ వేరియంట్ గురించి తొలుత చెప్పడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.





