
642views
విజయవాడ: విజయవాడలోని సత్యనారాయణపురం, శ్రీ శిశు విద్యామందిరం ప్రాంగణంలో పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా కిందటి నెల 29న కార్తీక సోమవారం, 30వ తేదీ మంగళవారం కార్తీక ఏకాదశి, ఈ నెల ఒకటోతేదీ బుధవారం మూడు రోజులపాటు అత్యంత వైభవంగా శతసహస్ర దీపార్చన, శ్రీ రమా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు భక్తి ప్రపత్తులతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో శైవపీఠం శ్రీ శివస్వామిజి అనుగ్రహ భాషణం చేసి కార్తీకమాస వైశిష్ట్యం, దీపార్చన అంతరార్థం వివరించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








