ఉత్తర రైల్వేలో పలుపోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ, డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 జనవరి 2019.
సంస్థ పేరు : ఉత్తర భారతీయ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 19
పోస్టు పేరు : గ్రూపు సీ, గ్రూపు డీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 జనవరి 2019
విద్యార్హతలు: గ్రూపు సీ: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత గ్రూపు డీ: పదవ తరగతి పాసవడంతో పాటు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ
వయస్సు : 18 నుంచి 35 ఏళ్లు.. రిజర్వేషన్లు వర్తింపు
వేతనం: నెలకు రూ. 5200-20200/-
అప్లికేషన్ ఫీజు : జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
దరఖాస్తులకు చివరితేదీ :30 జనవరి 2019
Source : One India
https://telugu.oneindia.com/news/india/northern-railway-recruitment-2019-apply-19-group-c-d-posts-237557.html