News

వ్యక్తి నిర్మాణ కార్యంలో 93 సం||లుగా RSS కృషి : ఒంగోలు ఎలైట్ మీట్ లో వక్త శ్రీ విజయాదిత్య.

525views

ఈ దేశం అన్నిరంగాలలో సర్వోన్నత స్థితికి చేరుకోనుటకై అవసరమైన నిష్ఠ కలిగిన వ్యక్తినిర్మాణ ప్రక్రియ ధ్యేయంగా గత 93 సంవత్సరములుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషిచేస్తున్నదని సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య గారు పేర్కొన్నారు.
ఒంగోలులో ని హోటల్ సరోవర్ లో జనవరి 6 వతేది జరిగిన ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశములో వారు మార్గదర్శనం చేశారు.సమాజములోని మేధావి వర్గం తమ ఉద్యోగవ్యాపారాలతో పాటు కొంతసమయం దేశంకోసం కూడా కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు,లాయర్లు,డాక్టర్స్,విద్యాసంస్థల యజమానులు హాజరయ్యారు.