News

బల్గేరియాలో బస్సు దగ్ధం!

459views
  • 45 మంది యాత్రికుల సజీవ దహనం

  • మృతుల్లో అయిదుగురు చిన్నారులు

సోఫియా: బల్గేరియాలో ఘోరం జరిగిపోయింది. ఓ యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు. రాజధాని సోఫియాకు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటర్‌వేలో తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ విపత్తు నియంత్రణ సేవ అధిపతి నికోలాయ్‌ నికోలోవ్‌ చెప్పారు. క్షతగాత్రులను రాజధానిలోని ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి