
వాషింగ్టన్: వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గోడాడీ. కామ్ హ్యాక్ అయింది. దాదాపు 12 లక్షల మంది వర్డ్ ప్రెస్ యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని అంటున్నారు. US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ద్వారా ఈ సమస్య కనుగొనబడింది. వెంటనే ఐటీ ఫోరెన్సిక్స్ సంస్థ సహాయంతో విచారణ ప్రారంభింది గో డాడీ.
గో డాడీ సంస్థ ఒక ఇంటర్నెట్ డొమైన్ రిజిస్ట్రార్, వెబ్ హోస్టింగ్ కంపెనీ. ఇది 17 మిలియన్ల కస్టమర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద డొమైన్. పరిపాలనలో 71 మిలియన్ డొమైన్‌లు ఉన్నాయి. వెబ్ హోస్టింగ్ సేవలను అందిస్తూ ఉంది. అయితే, 12 లక్షల వర్డ్‌ప్రెస్ (WordPress) వినియోగదారుల డేటా లీకయ్యే ప్రమాదంలో ఉన్నట్టు ప్రకటించింది.
వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఎన్విరాల్‌మెంట్‌కు అనధికారిక థర్డ్ పార్టీ యాక్సెస్ కనుగొన్నట్టు యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు వెల్లడించిన వివరాల్లో పేర్కొంది. పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వర్డ్ ప్రెస్ కోసం మా లెగసీ కోడ్‌బెస్‌లో ప్రొవిజనింగ్ సిస్టమ్‌ను యాక్సెస్ చేసినట్టు తెలిపింది.
హ్యాక్ చేసి సంపాదించుకున్న డేటాను వాడినట్టు ఎటువంటి నివేదికలు లేనప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సెస్టెంబర్ 6 నాటికి GoDaddy సిస్టమ్‌లకు యాక్సెస్ పొందడానికి పాస్‌వర్డ్‌ను ఉపయోగించారని తెలిపింది. ఈ నెల 17న హ్యాక్ జరిగినట్టు గుర్తించామని సంస్థ తెలిపింది. “మేము మేనేజ్ చేస్తున్న WordPress హోస్టింగ్ వాతావరణంలో అనుమానాస్పద కార్యాచరణను గుర్తించాము. వెంటనే IT ఫోరెన్సిక్స్ సంస్థ సహాయంతో దర్యాప్తు ప్రారంభించాము. ఒక కాంప్రమైజ్డ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, అనధికారిక థర్డ్ పార్టీ నిర్వహించబడే WordPress కోసం మా లెగసీ కోడ్ బేస్‌లోని ప్రొవిజనింగ్ సిస్టమ్‌ను యాక్సెస్ చేసింది” అని కంపెనీ వివరించింది.
Source: NationalistHub





