
571views
న్యూఢిల్లీ: భారతదేశం నుంచి సింగపూర్‌కు నవంబర్ 29 నుంచి రోజువారీ ఆరు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని సింగపూర్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ కార్యక్రమం కింద సింగపూర్, భారతదేశం మధ్య వాణిజ్య విమానాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి రోజువారీ ఆరు విమానాల సర్వీసులు ఉంటాయి.