News

వేర్పాటువాది సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాం ఉద్యోగం తొలగింపు : ఉగ్ర సంబంధాలే కారణం

515views

మ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు సహాయం చేశాడనే కారణంతో పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాంను శనివారం (అక్టోబర్ 16) నాడు ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.

దోడాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫరూక్ అహ్మద్ భట్ కూడా ఉగ్రవాద సంబంధాల కారణంగానే విధుల నుంచి తొలగించబడ్డాడు.

అనీస్ 2016 లో షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC) లో పరిశోధనా అధికారిగా నియమించబడ్డాడు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం యొక్క ఉన్నత స్థాయి సమావేశాలు, VVIP సమావేశాలను పర్యవేక్షించే సంస్థ.

“అనీస్ జూలై 31 మరియు ఆగష్టు 7, 2016 నుండి అనేకసార్లు పాకిస్తాన్ వెళ్లాడు. తన తాత ఆదేశాల మేరకు ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కల్నల్ యాసిర్ ‌ను కలిశాడు”. సయ్యద్ అలీ షా గీలాని ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 న మరణించాడు.

ఉగ్రవాది బుర్హాన్ వానీని భద్రతా దళాలు హతం చేసిన తర్వాత 2016 లో లోయలో జరిగిన హింస నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం అనీస్ ను ఆ ఉద్యోగంలో నియమించింది.

అనీస్ కు ISI తో సంబంధాలు ఉన్నాయని, జమ్మూ & కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల గురించి కీలకమైన సమాచారాన్ని వారికి అందజేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి.

అహ్మద్ భట్ సోదరుడు మొహమ్మద్ అమిన్ భట్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది. అతని మరొక సోదరుడు సఫ్దార్ అలీ కూడా తన తీవ్రవాద కార్యకలాపాల కారణంగా జైలులో ఉన్నాడు.

ఆగస్టు 5, 2019 న, కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. దాంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించబడింది.

జులైలో, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారులు, మరో ఇద్దరు పోలీసు సిబ్బందితో సహా మొత్తం 11 మంది ఉద్యోగులను తొలగించింది.

ఈ ఏడాది సెప్టెంబరులో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక అటవీ శాఖ సీనియర్ అధికారి, ఒక ఆర్ అండ్ బి ఉద్యోగి మొత్తం ఆరుగుర్ని ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. వీరంతా రహస్యంగా ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నవారే. కొందరు సహకార బ్యాంకు ఉద్యోగుల్ని కూడా ప్రభుత్వం ఇవే ఆరోపణలపై తొలగించడం గమనార్హం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ప్రకారం ఇలాంటి కేసులను పరిశీలించడానికి, సిఫార్సు చేయడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం సదరు ఉద్యోగులపై చర్యలు చేపడుతోంది. దీనికి ముందు, DSP దేవేంద్ర సింగ్ కూడా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో సర్వీస్ నుండి తొలగించబడ్డాడు.

Source : Organiseer

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.