News

జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసు

752views
  • ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిని తాలిబన్‌లతో పోల్చడంపై పరువు నష్టం దావా

ముంబై: ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి)ని తాలిబ‌న్ల‌తో గీత రచయిత జావేద్ అక్తర్ పోల్చ‌డంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అత‌నిపై థానే కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీంతో కోర్టు నవంబర్ 12న హాజరు కావాలని జావేద్ అక్తర్‌కు సోమవారం నోటీసు జారీ చేసింది.

ఆర్ఎస్ఎస్ కార్యకర్త థానే సివిల్ కోర్టులో అడ్వకేట్ ఆదిత్య మిశ్రా, అడ్వకేట్ స్వప్నిల్ కాలే ద్వారా సివిల్ పరువు నష్టం దావా వేశారు. పిటిషన్‌లో, గీత రచయిత జావేద్ అక్తర్ సంస్థ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేలా వ్యాఖ్యానించ‌డంతో తాను బాధ‌ప‌డ్డాన‌ని, అందువ‌ల్ల రూపాయి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంద‌ని పిటిష‌న‌ర్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ జావేద్ అక్తర్‌పై నిప్పులు చెరిగారు. ఏదైనా భారతీయ సంస్థలను తాలిబాన్‌లతో పోల్చడం ఖండించదగినదని, అలాంటి పోలిక హిందూ సంస్కృతికి అగౌరవమని అన్నారు.

అంతకుముందు, భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్య‌క‌ర్త‌లు ముంబైలోని అక్తర్ నివాసానికి ఎదురుగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.