News

పాక్‌లో సత్తాచాటిన హిందూ మహిళ

237views

లాహోర్‌: పాకిస్తాన్‌లో హిందూ యువతి తన సత్తా చాటింది. పాక్‌లో అత్యున్నత ఉద్యోగమైన పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు సనా రాంచంద్‌ గుల్వానీ అనే హిందూ యువతి ఎంపికైంది. అంతేకాకుండా ఈ ఉద్యోగాన్ని తన తొలి అటెంప్ట్‌ లోనే కైవసం చేసుకుంది. పాక్‌లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఆ దేశంలో అత్యున్నత ఉద్యోగాల్లోకి మైనార్టీలు వెళ్లడం అత్యంత కష్టమైనా సనా రాంచంద్‌ గుల్వానీ అద్భుతం చేసి చూపించింది.

సనా రాంచంద్‌ గుల్వానీ వయస్సు 27 ఏళ్ళు. డాక్టర్‌ సనా మొదటి ప్రయత్నంలోనే సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణులైంది. పాకిస్తాన్‌ చరిత్రలో ఈ పరీక్షలో విజయం సాధించిన మొదటి హిందూ యువతిగా చరిత్ర సృష్టించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత సనా నియామకం కూడా నిర్ధారించబడిరది. పాకిస్తాన్‌లో ఈ పరీక్ష చాలా కష్టం. కేవలం రెండు శాతం కంటే తక్కువ అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధించారు. సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ అనేది పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో నియామకాల కోసం ఒక పరీక్ష. భారతదేశంలోని యూపీఎస్‌సీ ప్రమాణాలతో ఈ పరీక్షతో పోల్చవచ్చు. సింధ్‌ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన సనా పరీక్ష రాసి విజయం సాధించింది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి