
-
ఇస్లామిక్ పండితుడు మౌలానా కలిమ్ సిద్ధిఖీ అరెస్టు
-
దేశవ్యాప్తంగా ‘మార్పిడి’ సిండికేట్
-
విదేశాల నుండి భారీగా నిధులు
-
ఒక్క బహ్రెయిన్ నుంచే రూ.1.5 కోట్లు రాక
లక్నో: యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనుమానించినట్టు అతడు మతోన్మాదేనని నిర్ధారణ అయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుండి దేశవ్యాప్తంగా అక్రమ మత మార్పిడి సిండికేట్ నడుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా కలిమ్ సిద్ధిఖీని యుపీ ఏటీఎస్ బుధవారం అరెస్టు చేసింది. ఏటీఎస్ వివరాల ప్రకారం… కలిమ్‌కు హవాలా ద్వారా విదేశాల నుండి నిధులు సమకూరాయి.
దీంతో ప్రజలను మభ్యపెట్టి, యథేచ్ఛగా మత మార్పిడిలకు పాల్పడ్డాడు. ఇంకా.. షరియా వ్యవస్థను అమలు చేయడానికి, జనాభా నిష్పత్తిని మార్చడానికి పెద్ద ఎత్తున మార్చేలా చేశాడు. మౌలానా అనుమానాస్పద కార్యకలాపాల దృష్ట్యా అతడిని చాలా కాలంగా పర్యవేక్షిస్తున్నట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం, మౌలానా కలీమ్‌ని ఏటీఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మత సంస్థల ముసుగులో అక్రమ మత మార్పిడి చర్యలు
ఏటీఎస్ అధికారుల సమాచారం ప్రకారం, ముజఫర్ నగర్ నివాసి అయిన మౌలానా కలిమ్ సిద్ధిఖీ ఢల్లీిలో నివసిస్తున్నారు. వివిధ విద్యా, సామాజిక, మతపరమైన సంస్థల ముసుగులో అక్రమ మత మార్పిడులను నిర్వహిస్తున్నారు. దీనికి విదేశాల నుండి నిధులు అందుతున్నాయి. అతను ముస్లిమేతరులను తప్పుదోవ పట్టించాడు. బెదిరించాడు, వారిని మతం మార్చాడు, తరువాత వారిని కూడా ఈ పనిలో నిమగ్నం చేస్తున్నాడు.
మౌలానా కలిమ్ జామియా ఇమామ్ వలీయుల్లా అనే ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. అతను అనేక మదర్సాలకు నిధులు సమకూర్చాడు. దీని కోసం విదేశాల నుండి హవాలా ద్వారా అతనికి భారీ డబ్బు వస్తోంది. మౌలానా, ఈ మదర్సాల ముసుగులో, మానవత్వం సందేశాలను ఇస్తారనే నెపంతో వెళ్ళిన వాళ్ళు భయం లేదా అత్యాశకు గురై ఇస్లాం స్వీకరిస్తున్నారు. తర్వాత వీరికి ఇతర వ్యక్తులను మత మార్పిడికి శిక్షణ ఇస్తున్నారు.
దర్యాప్తులో ఆరు బృందాలు నిమగ్నం
ఈ వ్యవహారంలో ఏటీఎస్‌కు చెందిన ఆరు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అలాగే, ఏడీజీ(అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ కథనం మేరకు, ఇప్పటివరకు జరిగిన విచారణలో, మౌలానా ట్రస్ట్ జామియా ఇమామ్ వలీయుల్లా బహ్రెయిన్ నుండి అందిన రూ .1.5 కోట్లతో సహా మొత్తం రూ.3 కోట్ల నిధులు వచ్చినట్టు కనుగొన్నారు. కాగా, మౌలానా కలీం షరియత్ ప్రకారం చేసిన వ్యవస్థ మాత్రమే అందరికీ న్యాయం చేయగలదని ప్రజలకు మభ్యపెట్టి బోధించేవాడు.’
Source: amarujala