
778views
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోమారు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకుని, భారత్‌పై విషం కక్కింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ.. పలు పత్రాలను విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో 131 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ, జాతీయ భద్రతా సలహాదారు యూసఫ్ భారత నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు ఖురేషీ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
కశ్మీర్ తమ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. పాకిస్థాన్ జోక్యం చేసుకుంటూనే ఉంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ముగింపు పలికి, వాస్తవాలను అర్థం చేసుకోవాలని అనేకమార్లు హితవు పలికినా పాక్ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా.. కశ్మీర్ ప్రజలపై భారత్ రసాయన ఆయుధాలను ప్రయోగిస్తోందని తాజాగా ఆరోపించింది.





