News

భారత నౌకా వాయు దళానికి.. అత్యున్నత ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం..

537views

క్షణ రంగంలో అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కకలర్స్ను అందుకోవడం లో నావికా దళం ముందుంటుంది. 1951 మే 27న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత నౌకాదళానికి తొలిసారిగా ఈ తరహా పురస్కారాన్ని అందించారు. తర్వాత కాలంలో దక్షిణ నౌకాదళం, తూర్పునౌకాదళం, పశ్చిమ నౌకాదళం, తూర్పు ఫ్లీట్, పశ్చిమ ఫ్లీట్, సబ్ మెరైన్ ఆర్మ్, ఐఎన్ఎస్ శివాజీ, భారత నౌకా అకాడమీలు వరుసగా ఈ ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారాన్ని అందుకున్నాయి. తాజాగా భారత నౌకా వాయు విభాగం(ఇండియన్ నావల్ ఏవియేషన్)కు ఈ అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి అందించనున్నారు. ఈనెల 6న గోవాలో జరగనున్న ఈ ఉత్సవానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఐఎన్ఎస్ హంసలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా తపాల శాఖ ప్రత్యేక కవర్ను కూడా విడుదల చేయనుంది. గోవా గవర్నర్, దేశ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి నౌకాదళ చీఫ్ ఇతర మిలటరీ ఉన్నతాధికార్లు దీనికి హాజరుకానున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి