పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, శ్రీనగర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వైమానిక స్థావరాలను తిరిగి తెరిచింది. కోట్లి మరియు రావల్ కోట్‌లోని ఎయిర్ బేస్‌లు, నియంత్రణ రేఖకు (ఎల్‌ఓసి) దగ్గరగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) లో ఉన్నాయి రెండూ. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి మూతపడి ఉన్నాయి. ఈ రెండు ఎయిర్ బేస్‌లు శ్రీనగర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మెరుపు దాడి చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో చాలా కాలంగా వినియోగంలో లేని రెండు ఎయిర్ బేస్ లను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తిరిగి తెరిచినట్లు సమాచారం.
ఎల్‌ఓసి కి దగ్గరగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సౌకర్యాల పునః ప్రారంభం గురించి భారత సైన్యం దగ్గర కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌లోని షమ్సీలో స్థావరాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ పావులు కదుపుతోంది. సింధులోని జాకబాబాద్‌లోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరం సమీపంలో ఒక కొత్త ఆర్మీ కంటోన్మెంట్ నిర్మాణం చేయడం, ఉద్రిక్తతలకు కారణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాక్ ఆర్మీ 23వ డివిజన్‌లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. రావల్ కోట్ ఎయిర్ బేస్, పాక్ ఆర్మీ 12 డివిజన్ కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు ఇది వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్ ను పీఏఎఫ్ తిరిగి తెరిచింది. ఎఫ్-16 యుద్ధ విమానాలను స్వల్ప సంఖ్యలో మోహరించింది. బలూచిస్థాన్‌లోని షమ్సీ ఎయిర్ బేస్ ను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) బలోపేతం చేస్తున్నది. సింధులోని జాకబాబాద్ పీఏఎఫ్ స్థావరం సమీపంలో కొత్త సైనిక కంటోన్‌మెంట్ ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లీ ఎయిర్-బేస్ కు వందకు పైగా వాయు రక్షణ దళాలు తరలించబడ్డాయి.