News

ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

581views

వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. బహిరంగ‌ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్టు చెప్పారు.

 

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.