News

అస్సాం: ముస్లింలలో పెరుగుతున్న బాల్య వివాహాలు – నిందితుల అరెస్ట్

971views

దిగువ అస్సాంలోని మైనారిటీ ప్రాంతాల్లోని ముస్లింలు మరియు వలస వచ్చిన ముస్లింలలో బాల్య వివాహాలు ప్రమాదకరమైన ధోరణులకు ఆజ్యం పోస్తున్నాయి. దిగువ అస్సాంలోని బార్పేట మరియు దక్షిణ సల్మారా జిల్లాల్లో అనేక బాల్యవివాహాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని హౌలీ ప్రాంతంలో బాల్య వివాహాలకు పాల్పడిన ముగ్గుర్ని బార్పేట పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల మైనర్ బాలిక తండ్రి కాసెమ్ అలీ మరియు వరుడి తండ్రి బసెర్ అలీలు ఒక న్యాయవాది తయారు చేసిన ‘ముందస్తు ఒప్పందం’ సాయంతో వివాహాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు.

బాల్యవివాహాల గురించి తెలుసుకున్న బాలల హక్కుల కార్యకర్తలు హౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాసేమ్ అలీ మరియు బసెర్ అలీలు ముందస్తు ఒప్పందం ఆధారంగా వివాహ వయస్సు లేని తమ పిల్లలకు వివాహం చేయబోతున్నట్లు పోలీసులు వెంటనే గుర్తించారు. వరుడు మరియు వధువు యొక్క తండ్రులు ఇద్దరూ చట్టపరమైన నిబంధనల నుండి తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికే ఆ ఒప్పంద పత్రం తయారు చేసుకున్నారు. కానీ పోలీసులు తమ విచారణలో వధువు వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అని, అందువల్ల ఆ వివాహాన్ని నిర్వహించడానికి ఎలాంటి ఒప్పందమూ చెల్లదని పేర్కొన్నారు. వరుడు జాహిరుల్ ఇస్లామ్ ‌తో పాటు కాసేమ్ మరియు బసర్ అలీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

మరొక సంఘటనలో సౌత్ సల్మారా పోలీసులు బాల్యవివాహం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక కాజీని అరెస్టు చేశారు. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని కాలాపానీ ప్రాంతంలో వివాహం జరుగుతున్న స్థలంపై నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన వరుడు, వారి కుటుంబం అక్కడి నుండి పారిపోయారు. కానీ పోలీసులు కాజీ మౌలానా ఇబ్రహీం అలీని పట్టుకున్నారు. వధూవరులిద్దరూ వివాహానికి తగిన వయస్సు ఉన్నవారు కాదని, అరెస్టయిన కాజీయే ఆ వివాహాన్ని నిర్వహిస్తున్నాడని కాలపాణి పోలీసులు తెలిపారు.

అరెస్టయిన కాజీ మరియు వధూవరుల కుటుంబంపై కేసు నమోదయింది. గడచిన ఒక నెలలో, కాలపానీ పోలీసులు ఈ ప్రాంతంలో 4 బాల్య వివాహ ప్రయత్నాలను విఫలం చేశారు. ఈ నేరాలలో పాలుపంచుకున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శిక్షార్హమైన నేరం అయిన బాల్య వివాహానికి వ్యతిరేకంగా తాము ప్రజలను చైతన్య పరుస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ ప్రజలు పోలీసుల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. ముస్లిం కాజీలే ఈ బాల్య వివాహాలకు ఆజ్యం పోస్తున్నారని కూడా పోలీసులు వెల్లడించారు.

అస్సాంలోని మైనారిటీ ప్రాంతాల్లో పోలీసులకు, ప్రభుత్వానికి తెలియకుండా వందలాది బాల్యవివాహాలు జరుగుతున్నాయని, దిగువ అసోంలో పనిచేస్తున్న బాలల హక్కుల సంస్థ పేర్కొంది. అస్సాంలో వలస వచ్చిన ముస్లింల జనాభా యొక్క పేదరికము, అనారోగ్యాలే ఈ బాల్య వివాహాలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.