ప్రపంచ సంస్కృత దినోత్సవం (ఆగస్టు 22) నాడు ప్రారంభం కానున్న ప్రపంచంలోని మొట్టమొదటి సంస్కృత OTT ప్లాట్ ఫాం

ప్రముఖ చలనచిత్రనిర్మాత అశోకన్ PK గారి ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి సంస్కృత OTT ప్లాట్ ఫామ్, ప్రపంచ సంస్కృత దినోత్సవం, ఆగస్టు 22 న ప్రారంభం కానున్నది.
“సంస్కృత OTT బృందం సంస్కృత ఫీచర్ ఫిల్మలను, షార్ట్ ఫిల్మలను, వెబ్ సిరీస్ లను, ఎడ్యుకేషనల్ సిరీస్ లను, కుకరీ షోలను ఆ సంస్కృత OTT ఛానెల్‌లో ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల కోసం అందిస్తుంది” అని అశోకన్ PK ఒక ప్రకటనలో తెలిపారు.
రాబోయే సంవత్సరంలో, ఈ OTT ఫ్లాట్ ఫాం వేదికగా 15 సంస్కృత ఫీచర్ ఫిల్మ్ లను, 300 లకు పైగా విభిన్న కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. ఇది ఇతర ఛానెల్ లు మరియు ప్లాట్‌ఫారమ్ లలో అందుబాటులో లేని కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
“ప్రపంచ సంస్కృత దినోత్సవం రోజున ఛానెల్‌ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది, ఇది మా ప్రేక్షకులను పెంచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృత అభిమానులను చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది” అని అశోకన్ PK అన్నారు.
సంస్కృత బృందంతో పాటు సంస్కృత భాషా నిపుణులు, వివిధ సంస్కృత సంస్థల సహకారంతో, సంస్కృత అభిమానుల అభిరుచికి తగినట్టుగా ఈ ఛానెల్ ప్రత్యేకమైన కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
Source : Organiser.





