News

తాలిబన్లలో కేరళీయులున్నారా? వైరలవుతున్న తాలిబాన్ ఉగ్రవాదుల మలయాళ సంభాషణ

930views

కేరళలో ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క లోతుల్ని, స్థాయిని రూఢి పరచే మరో సంఘటన వెలుగులోకొచ్చింది. తాలిబాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన సందర్భంగా ఆ ఆనందంలో మలయాళంలో మాట్లాడుతున్న వీడియో ఒకటి వెలుగులోకొచ్చింది. ఒక తీవ్రవాది సంతోషంతో ఏడుస్తుండగా, మరో ఉగ్రవాది విజయం గురించి మాట్లాడమని అతడిని అడగడం ఆ వీడియోలో ఉంది . కేరళకు చెందిన అనేక మంది ఉగ్రవాదులు తాలిబాన్ మరియు ఇతర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలలో చురుగ్గా ఉన్నారనే విషయాన్ని ఈ వీడియో రుజువు చేస్తోంది.

గతంలో, కేరళ నుండి ఇస్లామిక్ ఉగ్రవాదులు సిరియా మరియు ఇరాక్ ‌లో ఇస్లామిక్ స్టేట్ ‌లో చేరినట్లు వార్తలు వచ్చాయి. యుద్ధంలో భర్తలు చనిపోయిన చాలా మంది మలయాళీ ISIS మహిళలు భారతదేశంలో ప్రవేశించడానికి భారత ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకూ ఆఫ్ఘనిస్తాన్‌లోని జైలులో ఉన్నారు. ఇప్పుడు, ఆ ఖైదీలను తాలిబాన్ విముక్తి చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆ మలయాళీ గృహిణుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. త్వరలో పదవీవిరమణ చేయనున్న కేరళ పోలీసు చీఫ్ లోకనాథ్ బెహ్రా కేరళలో స్లీపర్ సెల్స్ ఉన్న విషయాన్ని ధృవీకరించారు కూడా.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.