News

గాంధీజీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం…మరణం తరువాత అందుకోనున్న మొదటి వ్యక్తిగా రికార్డు

834views

జాతిపిత, మహాత్మా గాంధీని అమెరికా ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్​ మెడల్’తో గౌరవించుకోవాలని మరోసారి ప్రతినిధుల సభ తీర్మానించింది. ఈ ప్రతిపాదనను న్యూయార్క్​కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సభ ముందుకు తీసుకొచ్చింది. శాంతి, అహింస మార్గాల్లో మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ బీ మెలోని కోరారు. గాంధీ మార్గం.. మార్టిన్​ లూథర్​ కింగ్ జూనియర్, నెల్సన్​ మండేలా చేపట్టిన వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని మెలోని తెలిపారు. ఓ ప్రజాప్రతినిధిగా గాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్.. అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం. అయితే.. మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి గాంధీ కానున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.