273
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా ఆషాడ శుద్ధ త్రయోదశి నుంచి గురుపౌర్ణమి వరకు నిర్వహించే శాకంబరీ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. మనిషి ఆకలిని తీర్చడానికి అమ్మవారు ఉద్భవించిన అవతారమే శాకంబరి దేవిగా ప్రతీతి. ఈ దేవిని పూజించటం వల్ల క్షామం నుంచి విముక్తి లభించి… ఆకలి దరి చేరదని భక్తులు విశ్వసిస్తారు. శాకంబరీ దేవి ఉత్సవంలో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు దేవాదాయ సిబ్బంది తెలిపారు.