704
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎస్సీ,ఎస్టీలను మతం మారుస్తున్నారన్న ఫిర్యాదుతో జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మత మార్పిడిపై విచారించి తమకు నివేదించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మత మార్పిడిపై పిర్యాదులు, ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటురో 15 రోజుల్లో తెలియజేయాలని పేర్కొంది. గడువు లోపు నివేదిక ఇవ్వకపోతే తమ ముందు ప్రత్యక్షం గా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో మత మార్పిడి లపై కమిషన్ కూడా విచారణ చేయనున్నట్లు తెలిపింది.