Articles

మత మార్పిడులకో పుష్కర ఘాట్ కావాలట – సై అంటున్న అధికారులు – ఎంత ఘోరం? మమ్మల్ని ఇక ఈ దేశంలో బ్రతకనివ్వరేమో? అంటున్న హిందువులు. .

940views

మత మార్పిడులకో పుష్కర ఘాట్ కావాలట – సై అంటున్న అధికారులు – ఎంత ఘోరం? ఇక ఈ దేశంలో హిందువులను బ్రతకనివ్వరేమో? ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో హిందువుల దగ్గరనుండి వ్యక్తమౌతున్న ప్రశ్న లేదా ఆందోళన. కొంతమంది క్రైస్తవ పాష్టర్లు అమాయక హిందువులను వివిధ ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తూ వుండడం జగమెరిగిన రహస్యం. అనేక సందర్భాలలో హిందువులు అడ్డుకునే ప్రయత్నాలు చెయ్యడం, గొడవలు వాదనలు తరచూ జరుగుతూ వుంటున్నై. అయితే ఈ మధ్య రాజమండ్రి పుష్కర ఘాట్లలో కొంతమంది పాష్టర్లు మత మార్పిడులకు పాల్పడుతూ వుండటం స్థానిక హిందువులకు కోపం తెప్పించింది. తాము పవిత్రంగా భావించి పూజించే ఘాట్లలో విదేశీ మత వ్యాప్తికి ప్రయత్నించటమేమిటని ప్రశ్నిస్తూ వారు ఆ మత మార్పిడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మత మార్పిడులు జరుపుతున్న పాష్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాపానికి అసలుకే ఎసరు పెట్టే ప్రతిపాదనతో ముందుకొచ్చారు అధికారులు. దీనితో నిర్ఘాంత పోవడం హిందువుల వంతైంది. మేము తల్లిలా, పవిత్రంగా భావించే నది ఒడ్డున మా ధర్మానికి విరుద్దమైన కార్యక్రమాలేమిటి? అని వాపోతున్నారు. “ఏకంగా మతం మార్చుకోవడానికి ఒక ఘాట్నే కేటాయిస్తామంటున్నారు. ఎంత ఘోరం? ఇలాగే వదిలేస్తే మన ఇళ్ళల్లో, గుళ్ళల్లో కూడా వాటాలడిగేలా వున్నారు.” అనేది వారి ఆవేదన.

సాంస్కృతిక వారసత్వం:

గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ !

కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానదీ!!

అంటూ ప్రతి హిందువూ దేశంలోని నదులను ప్రతి నిత్యం స్మరించుకుంటాడు. ఈ దేశంలోని హిందువులకు అవి కేవలం నదులు కాదు. నదీమతల్లులు. మట్టిలో, మానులో, నీటిలో దైవాన్ని దర్శించటం హిందువుల సంస్కారం, సంస్కృతి. అలాంటి హిందువు జన్మించిన దగ్గరినుండి మరణించే వరకు జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్థమూ నదితో పెనవేసుకుని వుంటుంది. స్నానం, అన్నప్రాసన, పుట్టువెంట్రుకలు, మరణానంతర క్రతువులు అన్నీ నదితో పెనవేసుకున్న కార్యక్రమాలే. ఇవి కాక పండుగలు, పబ్బాలూ. ఇక పుష్కర స్నానాల సంగతి సరేసరి. పుష్కర సమయములో నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయని హిందువుల విశ్వాసం. ఇలాంటి హిందువుల ఆచారాల కోసమే ఏర్పడ్డవి ఘాట్లు. అలాంటి ఘాట్లలోకి క్రైస్తవులు జొరబడి మత మార్పిడులకు పాల్పడుతూ వుంటే అడ్డుకోవలసిన అధికారులు వారికి ఏకంగా ఒక ఘాట్నే కేటాయించే ప్రతిపాదన చేయటం హిందువుల యొక్క ఆవేదనకు, ఆందోళనకు, ఆగ్రహానికి కారణమౌతోంది.

ఇదిలా వుంటే క్రైస్తవ సంస్థలు, అధికారులు ఘాట్లను కేటాయించే వారి ప్రయత్నాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో కొంతమంది హిందూ సంస్థల కార్యకర్తలని భయాందోళనకి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న హిందూ సంస్థల కార్యకర్తల్ని క్రైస్తవ సంస్థల ప్రతినిధులు దుర్భాషలాడుతున్నారు. ఒక వైపు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. క్రైస్తవుడైన CI కృపానందం, స్వామి అనే స్థానిక BJP కార్యకర్తను స్టేషనుకు పిలిపించుకుని ఏకవచనంతో సంబోదిస్తూ అసలు మొత్తం అంశానికి దళిత రంగు పులిమి ” ఇది అట్రాసిటి కేసవుతుంది తెలుసా? నీ మెడకు చుట్టుకుంటుంది. మీ ఆటలు ఇక్కడ సాగవు ” అంటూ ఏదేదో మాట్లాడుతూ ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలన్నిటి వెనుక ఏదో విధంగా వారికి ఘాట్ కేటాయించాలనే ప్రయత్నం కనబడుతోంది. దీనికోసం హిందూ సంస్థల ప్రతినిధులను నయాన్నో, భయాన్నో లొంగదీసుకుని ఇందుకు ఒప్పించాలని అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. హిందూ సంస్థల ప్రతినిధులను చర్చలకాహ్వానిస్తోంది.

అయితే హిందూ సంస్థల ప్రతినిధులు ఈ క్రింది ప్రశ్నలను సంధిస్తున్నారు:

రాజమండ్రి పుష్కరాల రేవులో మతమార్పిళ్ల కోసం ఒక ఘాట్ కావాలన్న క్రైస్తవ పాస్టర్ల డిమాండ్ మీద హిందూ సంఘాలు, క్రైస్తవ సంఘాల మధ్య శాంతి సమావేశం ఏర్పాటు చేసి రాజీ ఫార్ములా కోసం ప్రయత్నిస్తున్న Sub-Collectorకి Legal Rights Protection Forum పంపిన ప్రశ్నలు:

– అసలు ముందు మతమార్పిళ్లు చేయడానికి కారణాలు ఏమిటో వివరంగా చెప్పాలి. ఒక సమూహంలో ఏ ఇద్దరికీ కూడా ఒకేసారి ఆకలి, దాహం వేయవు.. ఏ ఇద్దరూ ఒకేవిధంగా ఆలోచించరు. అలాంటిది అంతమంది ఒకేసారి మతం మారడానికి కారణాలు Sub-Collector వివరించగలగాలి.

– ఇలాంటి బలవంతపు మతమార్పిళ్ల కోసం ఘాట్ల ఏర్పాట్లు ఎలా చేస్తారు? దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఏర్పాటు ఉందా? హోం శాఖకు ఈ వ్యవహారం మొత్తం తెలియజేస్తున్నారా అసలు?

– అసలు మతం మారుతున్నవారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోందా? అటువంటి Mechanism ఏమైనా ఉందా అనేది Sub-Collector తెలియజేయాలి.

– రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మతమార్పిళ్ల కోసం ఘాట్ కావాలని కోరుతున్న క్రైస్తవ పాస్టర్ల వివరాలు ఏమిటి? వారు ఏ చర్చికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

– పాస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ చర్చిలకు అసలు ప్రభుత్వం నుండి అనుమతి అనుమతి ఉందా? ఉంటె Sub-Collector అవి చూపించాలి.

– ఆ పాస్టర్లు ఇప్పటి వరకు ఎంతమందికి బాప్టిజం ఇచ్చారు? బాప్టిజం తీసుకున్నవారికి సర్టిఫికెట్లు ఇచ్చారా? ఆ రికార్డులు ప్రభుత్వం వద్దనున్నాయా? ఉంటె చూపించాలి.

– ఈ పాస్టర్ల నుండి బాప్టిజం తీసుకున్నవారిలో వారిలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? ఎంతమంది BC-C సర్టిఫికెట్లు తీసుకున్నారు? ఈ లెక్కలు ప్రభుత్వం వద్దనున్నాయా? ఉంటె చూపించాలి.

రాజ్యాంగ వ్యతిరేకమైన, దేశ భద్రతకు, సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన ఈ అంశాన్ని Legalize చేసే అధికారం Sub-Collecterకి లేదు.

పైన అడిగిన అన్ని ప్రశ్నలకు రికార్డ్స్ తో సహా సరైన సమాధానాలు చెప్పిన తరువాతనే ఈ ప్రతిపాదనపై చర్చకు వస్తాం.

ఇవీ హిందువుల ప్రశ్నలు. పైగా వారు దీనికి దళిత రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. దళితులని ఘాట్లలోకి రానివ్వటం లేదంటూ దళిత బంధువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం కాదని. మేము క్రైస్తవుల మత మార్పిడులను మాత్రమే అడ్డుకున్నాం తప్ప దళిత బంధువుల ప్రవేశాన్ని కాదని. దళిత హిందువులెవరైనా, ఏ ఘాట్లో అయినా స్నానం చెయ్యడానికి తమకెలాంటి అభ్యంతరమూ లేదని హిందువులు స్పష్టం చేస్తున్నారు.

వీటన్నిటి వెనుకా వున్న క్రైస్తవ సంస్థల కుట్రలను హిందువులు కలిసికట్టుగా ఛేదించాలి. ఓట్ల కక్కుర్తితో అధికార పక్షం అధికారులను అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆటకు స్వస్తి పలకాలి.

ARTICLE PREPARED BY : SYAM PRASAD KORSIPATI.

http://www.organiser.org/Encyc/2018/12/4/Hindus-in-Andhra-.html