Articles

నెల్లూరు స్వర్ణాల చెరువులో వేల సంవత్సరాల నాటి శివలింగం. వెలికి తీసి గుడి కట్టిస్తామని అధికార పార్టీ నాయకుల వాగ్దానం. ముస్లిముల నిరసనలతో వెనుకడుగు. .

918views

నెల్లూరు స్వర్ణాల చెరువులో వేల సంవత్సరాల నాటి శివలింగం. వెలికి తీసి గుడి కట్టిస్తామని అధికార పార్టీ నాయకుల వాగ్దానం. ముస్లిముల నిరసనలతో వెనుకడుగు. హిందువుల ఆగ్రహం. రాజుకున్న మత ద్వేషం. చరిత్ర తవ్వుతున్న హిందూ సంస్థలు. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్ననిజాలు. చరిత్రలో మరుగు పరచిన అసలు నిజాలు ఇవే అంటున్న హిందూ సంస్థలు. అవేమిటో మనమూ తెలుసుకుందాం.

400 సంవత్సరాల క్రితం 1751లో సౌదీ నుంచి, మక్కా నుంచి 12 మంది ఇస్లాం మత వ్యాప్తి కోసం బయల్దేరారు. దారి పొడవునా లొంగిన వారిని మతం మారుస్తూ, మొండికేసిన వారిని హతమారుస్తూ, మహిళల మాన ప్రాణాలను దోచుకుంటూ, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్దకు చేరేసరికి నెల్లూరు ప్రాంత అరుంధతీయులు వారిని అక్కడ అడ్డుకున్నారు. అక్కడ జరిగిన హోరాహోరీ పోరులో ఆ 12 మంది తలలు తెగిపడ్డాయి.

అప్పటికి నెల్లూరు, నవాబుల పాలనలో ఉండటంతో ఇక్కడ ముస్లిముల దాస్టీకాలు అధికంగా ఉండడంతో తురకల దురహంకారానికి తెర దించినట్లవుతుందన్న ఉద్దేశ్యంతోనూ, కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశ్యంతోనూ, హిందువులలో ఆత్మ విశ్వాసం కలిగించటానికి వారి మొండాలను వారి గుర్రాలపై వేసి తరిమారు. ఆ గుర్రాలు మొండాలను తీసుకువచ్చి నెల్లూరులోని దర్గామిట్ట చెరువు వద్ద పడేశాయి. ఆ మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధయ్యారు.

ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన సాగుతుండడంతో వారిని అమర వీరులుగా కీర్తిస్తూ వారికి “బారా షహీద్” [పన్నెండు మంది అమర వీరులు] అని నామకరణం చేసి అక్కడ సమాధులు నిర్మించారు. కాలక్రమంలో ఆ చరిత్రను మరుగు పరచారు. హిందువులు కూడా జరిగిన వాస్తవాలు మరచిపొయ్యారు. ముస్లిములు, సెక్యులర్ హిందువులు కలసి సృష్టించిన కల్పిత గాధనే నిజమని నమ్ముతూ ప్రతి ఏడాది స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో కుల మతాలకతీతంగా అందరూ పాల్గొంటూ వస్తున్నారు.

11వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువును త్రవ్వించాడు. ఆ సమయంలో నాటి ఆచారాల ప్రకారం చెరువు మధ్యలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. వేసవిలో చెరువులో నీటి మట్టం తగ్గిన ప్రతిసారీ ఆ శివలింగం దర్శనమిస్తూ వుంటుంది. ఈ విషయం నెల్లూరు వాసులు చాలామంది ఎరిగినదే.

ప్రస్తుతంలోకి వస్తే పదమూడు సంవత్సరాల క్రితం స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా నాటి కాంగ్రెస్ నేత స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలనే ప్రతిపాదన చేశారు. అనుకున్నంత కాకపోయినా అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల సాయంతో బారా షహీద్ దర్గా మరియు స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని కొంత మేర సుందరీకరించారు. అప్పటి నుంచే నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి గుడి నుండి బారా షహీద్ దర్గా వరకు నెక్లెస్ రోడ్ నిర్మించాలనే ప్రతిపాదన వుంది. కారణాంతరాల వల్ల అది అమలుకు నోచుకోలేదు.

ఈ మధ్య కాలంలో నెల్లూరుకు చెందిన తెదేపా నాయకుడు, NUDA చైర్మన్ కూడా అయిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్వర్ణాల చెరువు వద్దకు మందీ మార్బలంతో వెళ్లి చెరువులోని శివలింగాన్ని వెలికి తీసి నెక్లెస్ రోడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభమౌతాయని, శతాబ్దాలుగా చెరువులో వున్న శివలింగాన్ని అక్కడి నుంచి తీసి ఒక ఆలయం నిర్మిస్తామని ప్రకటించారు.

ఆ వెనువెంటనే స్థానిక ముస్లిములు “స్వర్ణాల చెరువు మాది, అది మాకు లేకుండా చేస్తారా?” అని యాగీ చెయ్యడం మొదలు పెట్టారు. హిందూ ముస్లిములు ప్రతి ఏడాది ఘనంగా రొట్టెల పండుగ నిర్వహించుకునే ఆ చెరువు ఒడ్డున అన్య మత మందిర నిర్మాణానికి అంగీకరించబోమని, ఆ చెరువు ముస్లిములకు మాత్రమే చెందుతుందని, అక్కడ అన్య మత కార్యకలాపాలను అనుమతించబోమని డిమాండ్ చేస్తూ 20/11/2018వ తేదీన స్థానిక ముస్లిములు నగర వీధులలో ప్రదర్శన నిర్వహించారు. అంతే కాక గత 23/11/2018 శుక్రవారం మైనారిటీ నాయకుడు షఫీ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది మహమ్మదీయులు చెరువు వద్దకు చేరి చెరువులోనే నమాజు చేసి, జెండాలు పాతారు. అంతే కాక తమ ప్రయోజనాలకు భంగం కలిగించే పార్టీలకు తాము ఓట్లు వేయమని కూడా పేర్కొన్నారు. ఆ వెంటనే అధికార పక్ష నేతలు కొటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మంత్రి నారాయణ ముస్లిముల అభీష్టానికి విరుద్దంగా ఎలాంటి నిర్మాణాలు జరుపబోమని ముస్లిములకు పత్రికా ముఖంగా హామీ ఇచ్చారు.

అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు మెంటా రామ్మోహన్, భాజపా నాయకుడు మిడతల రమేష్ తదితరులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హిందువులెవరూ ఆలయాన్ని నిర్మించమని అడగకపోయినా అధికార పక్ష నాయకులే ఆర్భాటంగా ప్రకటన చేశారని, ఇప్పుడు ముస్లిముల బెదిరింపులకు భయపడి వెనుకడుగు వేయడం అంటే హిందువులను అవమానించినట్లే అవుతుందని పేర్కొన్నారు. హిందువుల ఓటు బ్యాంకును నిర్మిస్తామని, హిందువుల ప్రయజనాలకు అనుకూలంగా వ్యవహరించే రాజకీయ పక్షానికే తమ మద్దతని పేర్కొన్నారు. 11వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు స్వర్ణాల చెరువు నిర్మించిన సమయంలో అప్పటి ఆచారాల ప్రకారం చెరువు మధ్యలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడని, నాటి నుంచి నేటి వరకు ఆ లింగం అలాగే వుందని తెలిపారు. ప్రస్తుతం బారా షహీద్ దర్గా వున్న చోట నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక జైన మందిరము, హిందూ దేవాలయము ఉండేవని, 1905లో బ్రిటిష్ వారు రూపొందించిన గెజిట్లో ఆ వివరాలు పొందుపరచబడి వున్నాయని, నేటికీ లభ్యమవుతున్నాయని, అలాగే చెన్నైలోని సెంట్రల్ లైబ్రరీలో నెల్లూరు చరిత్రకు సంబంధించిన గ్రంధాలలో కూడా ఆ వివరాలు లభ్యమవుతున్నాయని, నెల్లూరు ఆర్కియాలజీ విభాగం వారి వద్ద కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలు వున్నాయని వారు వివరించారు. ఈ విషయాలన్నీ తెలుసు గనుకనే మేయర్ అజీజ్ తన పలుకుబడుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని బారా షహీద్ దర్గా వద్ద శాశ్వత నిర్మాణాలు చేపట్టి మరే వైపు నుంచీ సమస్యలు రాకుండా పటిష్టం చేసుకుంటూ వస్తున్నాడని ఆరోపించారు.

ఈ నేపధ్యంలో నెల్లూరంటే ప్రశాంతతకి, మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటారని, దశాబ్దాలుగా రొట్టెల పండుగలో ముస్లిం సోదరులతో కలసి మెలసి పని చేస్తూ, ముస్లిములకంటే హిందువులే ఎక్కువగా పాల్గొంటూ ఉండడం వల్లనే ఆ పండుగకు, ప్రాంతానికి విశేష ప్రాచుర్యం లభించిందని, నేడు హిందూ దేవాలయం నిర్మిస్తామంటే ముస్లిములు అడ్డు తగలడం ఏమిటని, నెల్లూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న మత సామరస్యానికి ఇది విఘాతం కలిగిస్తుందని, ముస్లిములు తమ తీరు మార్చుకుని సామరస్య ధోరణితో ముందుకు సాగాలని, విశాల దృక్పధంతో శివాలయ నిర్మాణానికి సహకరించాలని నెల్లూరులోని హిందువులు కోరుకుంటున్నారు.

Article prepared by Syam prasad Korsipati.