ArticlesNews

అజ్ఞాత దళిత యోధుడు మహారాజా సుహెల్ దేవ్

802views

హమ్మద్ గజనీ వంటి దురాక్రమణదారులు భారత దేశంపై దాడులు చేస్తూ ప్రముఖ దేవాలయాలను విధ్వంసం చేస్తున్న కాలం. వారికి ఎదురు లేని చీకటి యుగం అది.

సాలార్ మసూద్ నేటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బహరాయి వద్ద గల ప్రముఖ బాల సూర్య దేవాలయ విధ్వంసం కొరకు ఒక లక్షా పాతిక వేల సైన్యంతో వచ్చాడు. స్థానిక రాజు సుహెల్ దేవ్ క్రీ.శ 1034 జూన్ 10న రణరంగంలో సాలార్ మసూదును చంపేశాడు. మళ్ళీ 300 సంవత్సరాలు మరే విదేశీ దురాక్రమణ దారుడూ అటు వచ్చే ధైర్యం చేయలేదు. ఇంతకీ ఎవరీ మహారాజా సుహెల్ దేవ్?

త్రిలోకచంద్ వంశంలో శ్రావస్తిలో క్రీ.శ 996లో సుహెల్ దేవ్ జన్మించాడు. తండ్రి మంగళ ధ్వజుడు. తండ్రి మరణానంతరం 1027లో సుహెల్ దేవ్ రాజయ్యాడు. అతని రాజ్యంలో బహరాయి, గోండా, బలరాం పూర్, బారాబంకి, ఫైజాబాద్, శ్రావస్థి ఉన్నాయి. ఈ దళిత వీరుని పరాక్రమాన్ని 17వ శతాబ్దంలో “మిరాత్ – ఏ – మసూది” నాటకంలో చిత్రీకరించారు. వీరి విగ్రహం లక్నోలో దర్శనమిస్తుంది.

చరిత్రలో గుర్తింపుకు నోచుకోని దళిత వీరులు ఎందరో!!

ఇలా హిందూ ధర్మ రక్షా యజ్ఞంలో పాలు పంచుకుని వీరోచిత పోరాటం సలిపి అజ్ఞాతంగా, ఎలాంటి గుర్తింపుకూ నోచుకోకుండా ఉండిపోయిన అజ్ఞాత దళిత వీరులెందరో….. కానీ 2018 లో మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుహెల్ దేవ్ హిందూ ధర్మ రక్షణకై చేసిన పోరాటాన్ని గుర్తించి, ఆయన చిత్రంతో ఒక స్టాంపును విడుదల చేసింది. అంతకముందు కొద్ది సంవత్సరాలుగా ఈ విజయోత్సవ దినాన్ని అర్.ఎస్.ఎస్ నిర్వహిస్తూ వస్తోంది.

సేకరణ : K. శ్యాంప్రసాద్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.