617
మహారాష్ట్రలోని ఠానే జిల్లా కల్యాణ్ పట్టణంలో గల ఓ అపార్టుమెంట్‌లో భారీ సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులను పోలీసులు సీజ్ చేయడం కలకలం రేపింది. తమకు అందిన సమాచారంతో స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం రాత్రి ఫ్లాట్‌పై దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో ఓ ఫ్లాట్‌లో 400లకు పైగా నకిలీ ఓటర్ ఐడీలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని కమలేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో ఓటర్ ఐడీలను ఎందుకు ముద్రించారనే కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.