News

మావోయిస్టుల ద్వారా… ఏజెన్సీ గ్రామాల్లో కరోనా వ్యాప్తి..

218views

రోనా బాధిత మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే తగిన వైద్య సహాయం అందజేస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు.. చికిత్స తీసుకోకుండా…అటవిలోని గిరిజన గ్రామాల్లో వైరస్ విస్తరణకు కారణమవుతున్నారని హెచ్చరించారు. దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్‌, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో దాదాపు 100మంది మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో సుజాత అనే మావోయిస్టు నేతకు కొవిడ్‌ సోకినట్లు సమాచారం అందింది. ఈమెపై సుమారు రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలైన దినేష్‌, జయలాల్‌ కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఒక్కొక్కరిపై సుమారు రూ.10లక్షల చొప్పున నగదు రివార్డు ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.