
రాజస్థాన్ బరన్ జిల్లా ఛాబ్రాలోని ఒక మార్కెట్ లో జరిగిన చిన్న తగాదా పోలీసులపై రాళ్ల దాడికి, ఆరు షాపుల దహనానికి కారణమైంది.
ఏప్రిల్ 10వ తారీఖున కమల్ సింగ్ అనే వ్యక్తి పండ్లు కొనడం కోసం మార్కెట్ కి వెళ్ళాడు. కారు పార్కింగ్ విషయమై ఫరీద్, అబిద్, సమీర్ అనే ముగ్గురు యువకులు అతనితో గొడవ పడి అక్కడికక్కడ అతన్ని కత్తితో పొడిచారు. పక్కనే ఉన్న దుకాణదారులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాకేష్ అనే దుకాణదారుకి కూడా గాయమైంది. కమల్, రాకేష్ లు ఇద్దరూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
राजस्थान के बारां जिले मे दो संप्रदायों के झगड़े के बाद हालात देखिए ,कहाँ हैं क़ानून व्यवस्था @ashokgehlot51 जी
दुकाने लूट ली गयी,गाड़ियाँ जला दी गयी ,दो संप्रदायों क़े झगड़े मे पूरे इलाक़े मे दहशत फैली हुई है
@indiatvnews @BJP4Rajasthan pic.twitter.com/uoKGPsdw9f— Manish Bhattacharya (@Manish_IndiaTV) April 11, 2021
ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఏప్రిల్ 11న దాడి చేసిన ముగ్గురు యువకులపై చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ స్థానిక పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లిములు కూడా నిందితుల్ని విడిపించాల్సిందిగా కోరుతూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
రెచ్చిపోయిన అల్లరి మూకలు సమీపంలోని షాపులను లూటీ చేయడం, తగులబెట్టడం ప్రారంభించారు. కనీసం 6 దుకాణాలు తగులబడి పోయినట్లుగా అంచనా. సమీపంలో పార్క్ చేసి ఉన్న వాహనాలను కూడా దుండగులు తగులబెట్టారు. పోలీసుల పైన కూడా దాడి చేశారు. ఈ క్రమంలో సుమారు 12 మంది పోలీసులు గాయపడ్డారు.
राजस्थान में बारां जिले के छबड़ा कस्बे में भड़की हिंसा, दंगाईयों ने लगाई दुकानों में आग,कस्बे में कर्फ्यू लगाया,, दंगाइयों को काबू में करने के लिए पुलिस ने आंसू गैस के गोले दागे@PratapSSinghvi #Rajasthan #baran #chabra #Crime #India #Politics pic.twitter.com/yCYuRWtp4V
— News 4 Rajasthan (@news4rajasthan) April 11, 2021
దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయు గోళాలను ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ బన్సాల్, జిల్లా కలెక్టర్ రాజేంద్ర విజయ్ సంఘటనా స్థలికి చేరుకుని ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని అదుపులో ఉంచడానికి అదనపు బలగాలను కూడా రప్పించారు.
“ఘటన జరిగిన శనివారం సాయంత్రమే పోలీసులు స్పందించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. పోలీసులు ఘటనను తీవ్రంగా పరిగణించలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ఇంత నష్టానికి కారణమైంది. అమాయకుల దుకాణాలు తగులబడి పోయాయి.” అని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ సింఘ్వి ఆరోపించారు. ఈ ఘటనలో దయచేసి అమాయకులను అదుపులోకి తీసుకోవద్దని పోలీసులను కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ఛాబ్రా, బరన్ లలో 144 సెక్షన్ అమలులో ఉంది.
#छबड़ा में आज हुई घटना निंदनीय है। शनिवार शाम लड़कों के बीच हुई घटना को अगर स्थानीय पुलिस गंभीरता से लेती तो आज की घटना टाली जा सकती थी। शनिवार की घटना के बाद वहां के स्थानीय लोगों को लगता कि @PoliceRajasthan सुस्ती छोड़कर कार्यवाही कर रही है तो आज की दुर्घटना घटित नहीं होती।
— Pratap Singh Singhvi (@PratapSSinghvi) April 11, 2021
यह स्थानीय पुलिस की नाकामी है कि #छबड़ा में आजाद सर्किल से लेकर अलीगंज व लोटाभैरुं में भारी नुकसान हुआ, जिसमें निरपराध व्यापारियों की दुकानें जलाई गई। मैं लोगों से शांति-सद्भावना बनाए रखने की अपील और @BaranPolice को आगाह करता हूं कि बेकसूर लोगों को झूठे मुकदमों में न फंसाया जाए।
— Pratap Singh Singhvi (@PratapSSinghvi) April 11, 2021
Source : OPINDIA.





