416
అవంతిపోర, త్రాల్ ప్రాంతంలోని నౌబగ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేసినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఆపరేషన్ ఇంకా జరుగుతోందని, పోలీసుల, భద్రతా దళాల సంయుక్త బృందం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నదని కాశ్మీర్ ఐజి తెలిపారు.
అంతకుముందు బుధవారం షోపియన్ జిల్లాలో జరిగిన ఓ ఎన్ కౌంటర్లో అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఎజియుహెచ్) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. మొత్తానికి మన భద్రతాదళాలు గడచిన మూడు రోజుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని అంతమొందించాయి.
Source : Organiser.