ఆమెకు భరణం చెల్లించాలి : ట్రిపుల్ తలాక్ బాధితురాలు, పిటిషనర్ అటియా సబ్రీకి అనుకూలంగా సహారన్పూర్ కోర్టు తీర్పు

సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసులో పిటిషనర్లలో ఒకరైన అటియా సబ్రీ శనివారం సహారన్పూర్ కోర్టులో తన భర్తపై భరణం కోసం చేసిన పోరులో విజయం సాధించారు.
ఆమెకు నెలవారీ నిర్వహణగా నెలకు 21000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆమె భర్తని ఆదేశించింది.దానికి తోడుఈ కేసు సుమారు ఐదేళ్లుగా కొనసాగుతున్నందున బకాయిగా ఆమెకు 13.4 లక్షల రూపాయలు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
మొహమ్మద్ వాజిద్ అలీ మార్చి 2012 లో సబ్రిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2013 లో ఒక ఆడపిల్ల పుట్టింది. 2014 లో సబ్రికి మరో అమ్మాయి పుట్టింది.దాంతో ఆమెకు సమస్యలు ప్రారంభమయ్యాయ్.
మగ పిల్లలను కననందుకు అలీ, అతని కుటుంబం ఆమెను వేధించడం ప్రారంభించారు.వారు అదనపు కట్నం కూడా డిమాండ్ చేయడం ప్రారంభించారు. అప్పటినుండి ఆమెపై శారీరక,మానసిక హింస కొనసాగింది.
2015 నవంబర్ ట్రిపుల్ తలాక్ ద్వారా అలీ ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. దాంతో సబ్రి ప్రపంచం తలక్రిందులైపోయింది. ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టారు. దాంతో ఆమె “ట్రిపుల్ తలాక్” అనే మధ్యయుగపు మూఢ ఆచారానికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
3: 2 మెజారిటీతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో,సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ ను “రాజ్యాంగ విరుద్ధం”, “ఏకపక్షం” మరియు “ఇస్లాంలో భాగం కాదు” అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
తన భర్త నుంచి తనకు భరణం ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆమె సహారన్పూర్ కోర్టు మెట్లెక్కగా కోర్టు శనివారం ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది.
Source : Organiser.





