
446views
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీరా లెబ్బాయ్ మరాయ్‌కయార్ (104) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీజే అబ్దుల్‌కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు ట్రస్టీల్లో మరాయ్‌కయార్ కూడా ఒకరు.





