News

పాక్ లో హిందూ కుటుంబం అనుమానాస్పద మృతి

497views

పాకిస్తాన్ లో ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులు మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది. ఒకే ఇంట్లోని కుటుంబ సభ్యుల మృతదేహాలు పడ్డాయి. ఐదుగురు సభ్యుల గొంతులు కోసి ఉన్నాయి. దీంతో పాక్ లో ఉన్న హిందూ సమాజం షాక్ కు గురైంది. వారి గొంతులను పదునైన ఆయుధంతో కోసి ఉన్నట్లుగా తెలుస్తోంది. పాక్ లోని రహీమ్ యార్ ఖాన్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలో చాక్ నెంబర్ 135-పి లో రామ్ చంద్ నివాసం ఉంటున్నాడు.

అతని కుటుంబంలోని ఐదుగురూ విగతజీవులుగా శుక్రవారం కనిపించడం కలకలం రేపింది. పదునైన ఆయుధాలతో వారి గొంతులను కోసినట్లు, ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కత్తి, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై సోషల్ యాక్టివిస్ట్ బిర్బాల్ దాస్ The News International తో మాట్లాడారు. రామ్ చంద్ మెగ్వాల్ హిందూ మతానికి చెందిన వారని, 35 ఏళ్ల వయస్సున్న అతను చాలాకాలంగా టైలర్ షాప్ నడుపుకుంటూ..జీవితం గడుపుతున్నారని వివరించారు. కుటుంబంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాడని, ఈ ఘటన చాలా దిగ్ర్భాంతికి గురి చేసిందన్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.