News

పాక్ పై భారత్ పంజా విసిరి నేటికి రెండేళ్ళు

489views

ఫిబ్రవరి 26, 2021 న, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, పాకిస్తాన్ పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి “బాలకోట్ వైమానిక దాడి”. అది జరిగి నేటితో 2 సంవత్సరాలు పూర్తి అయింది. 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘోరమైన పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ బాలకోట్ వైమానిక దాడి జరిపింది. అనేక దశాబ్దాలుగా భారత దళాలపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛా హస్తం ఇచ్చిన తర్వాత, ఈ వైమానిక దాడికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యహరచనలో విజయవంతంగా పూర్తి చేశారు.

ఫిబ్రవరి 26, 2019 తెల్లవారుజామున 3:30 గంటలకు, 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను (ఎల్‌ఓసి) దాటి పాకిస్తాన్ బాలకోట్‌లోని జైష్-ఇ-మొహమ్మద్ (జెఎమ్) టెర్రర్ క్యాంపు‌ను ధ్వంసం చేశాయి. “ఆపరేషన్ బందర్” అని సంకేతనామం చేయబడిన ఈ వైమానిక చర్యకు భారత వైమానిక దళం యొక్క ఏడవ మరియు తొమ్మిదవ స్క్వాడ్రన్లు నిర్వహించారు. పాకిస్తాన్ భూభాగం లోపల దాడి చేయడానికి IAF అప్‌గ్రేడ్ చేసిన మిరాజ్ 2000 లను ఉపయోగించింది.

భారతదేశం బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ ఎలా ప్లాన్ చేసింది?

బాలకోట్ వైమానిక దాడి ప్రధానంగా 12 మిరాజ్ 2000 లచే నిర్వహించబడింది. ఇవి గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుండి బయలుదేరి పాకిస్థానీయుల కళ్లుగప్పి పాకిస్థాన్ భూభాగాన్ని చేరాయి. మిరాజ్ 2000 లు, మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి ఎగురుతూ, పాకిస్తాన్లోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు ఉత్తర, మధ్య భారతదేశం మీదుగా ప్రయాణించాయి.

పాకిస్తాన్‌లోకి ప్రవేశించడానికి ముందు, మిరాజ్ 2000 లు….

SU -30లుఎంకెఐలతో కలిసి 3 వేర్వేరు వ్యూహాత్మక పొజిషన్ లుగా ఏర్పడ్డాయి. పాకిస్తాన్ రాడార్ల దృష్టిని ఆకర్షించడంలో SU -30 లు ప్రధాన పాత్ర పోషించాయి. భారతీయ SU -30 లు దాడికి దిగుతున్నాయి అని భ్రమ కలిగించాయి. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఎఫ్ -16 యుద్ధ విమానాలను మోహరించింది. భారత్ SU-30 మీదనే పాకిస్తాన్ మొత్తం దృష్టి నిలిపేట్లు చూడగా, అదే సమయంలో ఊహకు అందని విధంగా మిరాజ్2000 యుద్ధ విమానాలు బాలకోట్ వైపు మెరుపు వేగంతో వెళ్ళి, ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైస్ 2000 బాంబులను తీవ్రవాద స్థావరాలపై పడేశాయి, దీనితో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఒక వేళ అక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితుల ఏర్పడినా క్షణాల్లో ఏ విధమైన ఆపరేషన్ ఐనా చేసేందుకు వీలుగా ఐఎఎఫ్ తన గరుడ కమాండోల బృందాన్ని స్టాండ్‌బైలో ఉంచింది.

బాలకోట్ వైమానిక దాడిపై పాకిస్తాన్ ఎలా స్పందించింది?

భారత్ వైమానిక దాడి జరిగిన తర్వాతి రోజు జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. పాకిస్తాన్ ఎఫ్ -16 ల యొక్క పూర్తి స్క్వాడ్రన్ తో ఈ దాడికి ప్రయత్నించగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానిని విజయవంతంగా అడ్డుకుని, ఒక పాకిస్తాన్ ఎఫ్ -16 ని కూల్చివేసింది, ఈ పాకిస్తాన్ ఎఫ్ -16 ను తన మిగ్ -21 బైసన్ నుండి కాల్చిన ఐఎఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దురదుష్టవశాత్తూ పాకిస్తాన్ కి పట్టుబడ్డాడు. అయితే భారత్ ప్రభుత్వం అద్భుత దౌత్య విజయంతో వింగ్ కమాండర్ అభినందన్ 2 రోజుల తరువాత పాకిస్తాన్ విడుదల చేసింది.

బాలకోట్ వైమానిక దాడి గురించి అప్పటి IAF చీఫ్ మాటల్లో…

బాలకోట్ వైమానిక దాడి భారతదేశానికి కాశ్మీర్ లోయ లోపల ఉగ్రవాదులను ఏరివేయడానికి సహాయపడింది. ప్రపంచానికి భారత సైనిక సామర్థ్యాలను చూపించడంలో సహాయపడింది. భారతదేశం “గుస్ కర్ మారెగా” (భారత్ ఇంట్లొకి దూరి కొడుతుంది) అని బాలకోట్ వైమానిక దాడి పాకిస్తాన్ కు ఒక సందేశం ఇచ్చిందని మాజీ వైమానిక దళం చీఫ్ బిఎస్ ధనోవా చెప్పారు. ఈ వైమానిక దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించారు.

పుల్వామా టెర్రర్ అటాక్: భారతదేశానికి ఒక చీకటి రోజు…

అంతకుముందు 2019 ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దారుణమైన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఘోరమైన దాడి తరువాత, పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఆ దాడికి బాధ్యత వహించింది. 22 ఏళ్ల ఆత్మాహుతి దారుడు ఆదిల్ అహ్మద్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో బస్సుపైకి దూసుకెల్లి ఈ దాడికి పాల్పడ్డాడు. కాన్వాయ్ ‌లో 78 బస్సులు ఉన్నాయి. ఇందులో జమ్మూ నుండి శ్రీనగర్ ‌కు 2,500 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అవంతిపోరా సమీపంలో జరిగిన ఈ దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

ఈ దాడి తరువాత, భారతదేశం పాకిస్తాన్ కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదాను కూడా ఉపసంహరించుకుంది మరియు ఉగ్రవాద దాడి నేపథ్యంలో మొత్తం అంతర్జాతీయ సమాజం భారతదేశానికి తన బలమైన మద్దతును తెలిపింది. ఈ దాడిలో మరణించిన మొత్తం 40 మంది జవాన్ల పేర్లు ఉన్న స్మారకాన్ని 2020 ఫిబ్రవరి 14 న పుల్వామాలోని లెత్‌పోరా క్యాంప్ లోని సిఆర్‌పిఎఫ్ శిక్షణా కేంద్రంలో ప్రారంభించారు. ఈ స్మారక చిహ్నం మొత్తం 40 మంది సైనికుల పేర్లతో పాటు వారి ఛాయాచిత్రాలతో సిఆర్పిఎఫ్ యొక్క నినాదం – “సేవా మరియు నిష్ట” (సేవ మరియు విధేయత) వ్రాసి ఏర్పాటు చేశారు.

అంతకుముందు రిపబ్లిక్ డే 2021 న, 2019 లో పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ఎఎస్ఐ మోహన్ లాల్ కు మరణానంతరం రాష్ట్ర పోలీసు మెడల్ ఆఫ్ శౌర్య చక్ర (పిపిఎంజి) లభించింది.
2019 ఫిబ్రవరి 14 న ఆత్మాహుతి దాడి జరగతున్నపుడు కాన్వాయ్ ‌లోని బస్సులోకి దూసుకెళ్లే ముందు ఐఇడితో నిండిన కారును గుర్తించి ఆ కారును ఆపడానికి కాల్పులు జరిపినందుకు మోహన్ లాల్ ‌కు ఆ పతకం లభించింది.

– కరుణాకర్ బూదూరు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.