
586views
గుజరాత్ లోని భరూచ్ కు చెందిన శ్రీమతి భారతి పటేల్ … శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కొరకు నిధి సమర్పించడానికి కార్యకర్తలను పిలిపించారు….
అక్కడి పరిస్థితి చూసి రామసేవకులు షాకయ్యారు …
ఎందుకంటే ఇంటి యజమాని భౌతికకాయం ఉందక్కడ. ఆమె బ్యాంక్ చెక్ తీసుకెళ్లి భర్త భౌతిక కాయం చేతిలో ఉంచి..రోదిస్తూ…
“అయోధ్యలో మందిర నిర్మాణం కోసం నా భర్త ఎంతో తపించారు..మందిర నిర్మాణపనులు జరుగుతున్నాయని ఎంతో సంతోషించారు. రాముడి గుడికి నిధి సమర్పణ వారి చివరికోరిక” అంటూ కార్యకర్తలకు చెక్కు అందచేశారు. బరువెక్కిన హృదయాలతో, విషణ్ణ వదనాలతో ఆ చెక్కును అందుకున్నారు కార్యకర్తలు. ఆ కుటుంబం యొక్క రామభక్తికి మనసులోనే జేజేలు పలికారు. సందేహమే లేదు వారి పవిత్ర ఆత్మ ఆ శ్రీరాముని చరణాల చెంతకు చేరుతుంది.





