News

సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్ పోటీల విజేతలు వీరే

94views

తాను స్వయంగా అనేక గ్రంథాలను చదవడమే కాకుండా ఏన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు స్వర్గీయ శ్రీరామశాయి. “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్ వారు ఔత్సాహిక, వర్ధమాన జాతీయవాద రచయితలకు వ్యాస రచన, గీత రచన, కవితా రచన పోటీలను నిర్వహించారు.

ఔత్సాహిక, వర్ధమాన రచయితల నుంచి ఈ క్రింద తెలిపిన అంశాలపై వ్యాసాలు, కవితలు, పాటలను ఆహ్వానించారు.

1)భారతీయతకు విజయ కేతనం రామజన్మభూమి తీర్పు
2) ఆంధ్ర నాట స్వాతంత్ర పోరాట అపురూప ఘట్టాలు (ఏవేని 1,2 ఘట్టాలు వివరించవచ్చు)
3) మాతృభాషను కాపాడుకుందాం
4) మతమార్పిడులు – పర్యవసానాలు – ప్రమాదాలు

వారి ఆహ్వానాన్ని మన్నించి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 47 మంది 72 రచనలు పంపారు. వారందరికీ ఈ రోజు అనగా 24/1/2021 ఆదివారం ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్ అధ్యక్షులు, ప్రముఖ రచయిత డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు పాల్గొని సంస్థ ఉద్దేశ్యాలు, లక్ష్యాల గురించి వివరించారు..

ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య మాట్లాడుతూ దేశంలోని లోపాలను, లోటుపాట్లను ఉద్దేశ్యపూర్వకంగా పదే పదే ఎత్తి చూపే రచనలే కాకుండా దేశం యొక్క ఘనతను, ఔన్నత్యాన్ని కూడా వెలికి తీయగలిగే రచనలు వెలువడాలని, అలాంటి రచనల, రచయితల కోసమే సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్ ప్రస్తుతం ఈ పోటీలను నిర్వహించిందని తెలిపారు.

అనంతరం ఈ పోటీల విజేతల వివరాలను ఆ సంస్థ సభ్యులు వెల్లడించారు.

వ్యాస రచన పోటీల విజేతలు :

వ్యాస రచన పోటీలలో మొత్తం 21 మంది పాల్గొన్నారు. మొత్తం 25 వ్యాసాలు పరిశీలకు వచ్చాయి.

విజేతల వివరాలు :
అంశం : ఆంధ్రనాట స్వాతంత్ర్య సమర ఘట్టాలు
విజేత పేరు : శ్రీ కనుమ ఎల్లారెడ్డి
ఊరు : తాడిపత్రి, అనంతపురం జిల్లా.
ఫోన్ : 9391523027

అంశం : భారతీయతకు విజయ కేతనం రామ జన్మభూమి తీర్పు
విజేత పేరు : డాక్టర్ కాదర్ బాద్ ఉదయశంకర్
ఊరు : నంద్యాల
ఫోన్ : 9440290498, 9490329587.

అంశం : మత మార్పిడులు – పర్యవసానాలు – ప్రమాదాలు
విజేత పేరు : శ్రీ దీవి వేంకట శేషశాయి
ఊరు : నరసరావుపేట
ఫోన్ : 9441452432

అంశం : మాతృభాషను కాపాడుకుందాం
విజేత పేరు : శ్రీ కొత్తా మణికంఠేశ్వరరావు
ఊరు : విజయవాడ
ఫోన్ : 9949067136

కవితా రచనల పోటీ విజేతల వివరాలు :

కవితల పోటీలలో మొత్తం 25 మంది పాల్గొన్నారు. మొత్తం 32 కవితలు పరిశీలకు వచ్చాయి.

విజేతల వివరాలు:

అంశం : భారతీయతకు విజయ కేతనం రామ జన్మభూమి తీర్పు
విజేత పేరు : శ్రీ బొగ్గరపు రాధాకృష్ణమూర్తి
ఊరు : నెల్లూరు
ఫోన్ : 9885481939

అంశం : మత మార్పిడులు – పర్యవసానాలు – ప్రమాదాలు
విజేత పేరు : శ్రీ ఇమ్మడి రాంబాబు
ఊరు : తొర్రూరు, మెహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ
ఫోన్ : 9866660531

అంశం : మాతృభాషను కాపాడుకుందాం
విజేత పేరు : శ్రీ సురేంద్ర రొడ్డ
ఊరు : తిరుపతి
ఫోన్ : 9491523570

అంశం : ఏదేని ఇతర దేశభక్తియుత, ప్రేరణాత్మక అంశం
విజేత పేరు : శ్రీ శ్రీధర్ కొమ్మోజు
ఊరు : వరంగల్
ఫోన్ : 9989464467

నమస్తే. సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్ నిర్వహించిన పాటల రచనల పోటీలలో పాలు పంచుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు.

పాటల రచనల పోటీలలో మొత్తం 12 మంది పాల్గొన్నారు. మొత్తం 15 పాటలు పరిశీలకు వచ్చాయి.

విజేతల వివరాలు:

అంశం : భారతీయతకు విజయ కేతనం రామ జన్మభూమి తీర్పు
విజేత పేరు : శ్రీ దుర్గాప్రసాద్ ఐనాడ
ఊరు : విశాఖ
ఫోన్ : 9502096218

అంశం : మత మార్పిడులు – పర్యవసానాలు – ప్రమాదాలు
విజేత పేరు : శ్రీ గున్నా కృష్ణమూర్తి
ఊరు : విశాఖ
ఫోన్ : 6304599218

అంశం : మాతృభాషను కాపాడుకుందాం
విజేత పేరు : శ్రీ గొల్లాపిన్ని సుబ్రహ్మణ్య శర్మ
ఊరు : తిరుపతి
ఫోన్ : 9989451287

అంశం : ఏదేని ఇతర దేశభక్తియుత, ప్రేరణాత్మక అంశం
విజేత పేరు : నామని సుజనాదేవి గారు
ఊరు : కరీంనగర్
ఫోన్ : 7799305575

* పోటీదారులందరికీ ప్రశంసాపత్రం, విజేతలకు బహుమతులు పోస్టు ద్వారా పంపబడతాయని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.