27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో క్వాత్-ఉల్-ఇస్లాం మశీదు నిర్మించారని పేర్కొంటూ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో పిటిషన్ దాఖలయింది.
జైన తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణుమూర్తి తరఫున హరిశంకర్ జైన్ మరియు న్యాయవాది రంజనా అగ్నిహోత్రిలు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) వారు ప్రదర్శించిన సంక్షిప్త చరిత్ర ప్రకారం అక్కడ 27 దేవాలయాలను కూల్చివేసి, క్వావత్-ఉల్-ఇస్లాం మశీదును నిర్మించారన్నది తెలుస్తోందని పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. మశీదు నిర్మాణానికి కూల్చివేసిన ఆలయాలకు సంబంధించిన వస్తువులనే ఉపయోగించినట్లుగా కూడా తెలుస్తోందని, కాంప్లెక్స్ లోపల ఆ ఆనవాళ్ళు కూడా ఉన్నాయని పిటిషన్ పేర్కొంది.
ఈ విషయంపై వెంటనే శాశ్వత ప్రాతిపదికన కోర్టు, ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్ దారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని కోసం వెంటనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసి కుతుబ్ కాంప్లెక్స్ లోని 27 హిందూ, జైన దేవాలయాలను పునరుద్ధరించి అక్కడ భక్తులు ఆ దేవి దేవతలను దర్శించుకోవడానికి, పూజలు చేసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించమని కూడా పిటిషన్ దారులు కోర్టును అభ్యర్థించారు.
Source : India faith
https://www.indiafaith.in//Encyc/2020/12/9/PIL-filed-in-Delhi-court-claims-mosque-at-Qutub-Minar-complex-was-built-after-the-demolition-of-27-Hindu-Jain-temples-.html





