News

భారత్‌ బయోటెక్ కి బారులు తీరిన రాయబారులు

354views

రోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాదు‌కు చేరుకున్నారు. భారత్ ‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద గల జినోమ్ ‌వ్యాలీకి వెళ్లారు. రెండు బృందాలుగా వీరు పర్యటిస్తున్నారు. మొదటి బృందంలోని వారు భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్ ‌ను సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించారు. విదేశీ రాయబారులకు కోవాగ్జిన్‌ టీకా వివరాలను భారత్ బయోటెక్‌ సంస్థ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లా వివరించారు.
రెండో బృందం బయోలాజికల్‌-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు టీకాల తయారీ సామర్థ్యంపై ఇచ్చే దృశ్యరూపక ప్రదర్శనను తిలకించింది. అక్కడి నుంచి భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్ ‌కు చేరుకుని.. అక్కడ శాస్త్రవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ అవుతారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకిస్తారు.

సాయంత్రం 6 గంటలకు తిరిగి దిల్లీకి బయల్దేరుతారు. పెద్దసంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం. వారి పర్యటనను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.