
526views
భారత నావికాదళం శుక్రవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్ ఐఎన్‌ఎస్ ప్రబల్ నుంచి అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఉపయోగంలో లేని ఓ నౌకను లక్ష్యంగా ఉంచారు. గరిష్ఠ దూరంలో ఉంచిన ఈ లక్ష్యాన్ని క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో చేరినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో విడుదల చేశారు.





