News

సరిహద్దుల్లో తెలుగు జవాను వీర మరణం

770views

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను బొంగు బాబూరావు (28) ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాను భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా స్థానిక యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి, 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు. శుక్రవారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.