News

శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరుల హతం

418views

మ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని మట్టుబెట్టిన జవాన్లు తాజాగా శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరులను హతమార్చారు. రాంబాగ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ముష్కరులు వారిపై కాల్పులు జరపగా జవాన్లు ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ చేశారు. కాగా వారిలో ఒకరు విదేశీయుడిగా గుర్తించారు. మరో వ్యక్తి స్థానికుడిగా తేల్చారు. ‘శ్రీనగర్‌లోని రాంబాగ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వేట కొనసాగిస్తున్నారు’ అంటూ కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.