News

అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు – ఏడుగురి మృతి

465views

ఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్‌ ప్రావిన్సులో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రావిన్సు గవర్నర్‌ ఉమర్‌ జాక్‌ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. రోడ్డు పక్కన దాచి ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఘటన జరిగినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు శనివారం ఉదయం ఈ ఘటనకు ముందు మరొక బాంబు పేలుడు జరిగింది. హెరాత్‌- కందహర్‌ మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయాల పాలయ్యారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.