News

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆరెస్సెస్ చీఫ్

400views

న రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఈరోజు ఉదయం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా ఆలయ ఈవో,  అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.

  మోహన్ భాగవత్ అమ్మవారిని దర్శించుకున్నారు.  అనంతరం దేవాలయ అధికారులు ఆయనకు అమ్మ వారి చిత్రపటాన్ని,  తీర్థ ప్రసాదాలను సమర్పించారు.  దర్శనానంతరం ఆయన  నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి లోని విజ్ఞాన విహార పాఠశాలకు చేరుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాష్ట్రస్థాయి కార్యకర్తలతో రెండు రోజులపాటు నూతక్కిలో జరగనున్న సమావేశాల నిమిత్తం వారు శుక్రవారం సాయంత్రం నూతక్కికి చేరుకున్న విషయం పాఠకులకు విదితమే.

ఈ సమావేశాలలో… ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఎంపిక చేసిన ఆంధ్ర ప్రదేశ్ కార్యకర్తలతో కలసి కార్య సమీక్ష,యోజన,రాబోవు కార్యక్రమాలలో కావాల్సిన మార్గదర్శనం చేస్తారని, ఈ కరోనా కాలఖండంలో RSS స్వయంసేవకుల సేవలు, వలస కార్మికుల స్థితిగతులు,గ్రామాల వికాసం,ప్రకృతి పరిరక్షణ,జల సంరక్షణ,భారతీయ ఆదర్శ కుటుంబ వ్యవస్థ,సామాజిక సమరసత కార్యక్రమాలు,సంఘ శాఖలు,కార్య ప్రగతి మొదలగు అన్ని విషయాలు అందరితో చర్చిస్తారని నిన్న సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో RSS తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.