News

హనుమద్వాహనంపై శ్రీనివాసుడు

483views

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాలను వేడుకగా నిర్వహించారు. ఈరోజు రాత్రి 7 నుంచి 8గంటల మధ్య స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.