News

కొడాలి నానిపై కేసు

571views

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తితిదేలో అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చే అంశం ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నారు. దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేవుని విగ్రహాలను బొమ్మలుగా వ్యాఖ్యానించడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లేనని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.