News

అంతర్వేది : క్రొత్త రథం నమూనా సిద్ధం

596views

పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావుతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయని.. అప్పటిలోగా కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.