
భారత దళాలు, చైనా ఆక్రమణ దళాల మధ్య లడఖ్‌లోని ఎల్ ఏ సిలో కొనసాగుతున్న గొడవ నుండి వెలువడుతున్న నివేదికల ప్రకారం పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డుకు సమీపంలో ఉన్న లడఖ్‌లో కీలకమైన శిఖరాన్ని ఆగస్టు 29-30 రాత్రి సమయంలో భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున ఉన్న స్పాంగూర్ గ్యాప్ లోని పోస్ట్‌ను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గార్డింగ్ ఇండియా పోర్టల్‌లో అందించిన నివేదిక ప్రకారం, భారత సైన్యం ఎల్ ఏ సిలో చైనా దళాలను అధిగమించి లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున అత్యంత కీలకమైన కొండను ఆక్రమించింది. నివేదికల ప్రకారం, భారత సైన్యం యొక్క ప్రత్యేక కార్యకలాపాల విభాగం ఆగస్టు 29-30 రాత్రి నిశ్శబ్దంగా కదిలింది. కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న చైనా దళాలు అప్రమత్తమయ్యే లోపే ఆ కొండను ఆక్రమించింది.
భారత సైన్యం చర్య చాలా వేగంగా జరిగిందని గార్డింగ్ ఇండియా నివేదిక పేర్కొంది. చైనా దళాలు ఆ సమయంలో నిద్రపోతున్నాయి. వారు మేల్కొనే లోగా భారత సైనికులు పని చక్క్బెట్టేశారు. భారత దళాలు ఇప్పుడు ఆ పర్వతంపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించాయి. ఎల్ ఏ సి లో అది అతి ముఖ్యమైన ప్రాంతము.
భారతదేశ రహస్య స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్) ఈ ఘనతను సాధించిందని నివేదిక పేర్కొంది. “పాంగోంగ్ త్సో సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున ఉన్న ఠాకుంగ్ పరిసరాల్లోని ఈ కొండ ఆక్రమించడం వల్ల ఇప్పుడు చైనా డిజైన్లతో సంబంధం లేకుండా భారత సైన్యం పాంగోంగ్ త్సో యొక్క మొత్తం దక్షిణ తీరాన్ని నియంత్రించగలదు” అని గార్డింగ్ ఇండియా నివేదిక పేర్కొంది.
ఇదిలా వుండగా, యుకె టెలిగ్రాఫ్‌లో నివేదిక ప్రకారం, శనివారం రాత్రి చుషుల్ గ్రామానికి సమీపంలో 500 మంది చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. ఏదేమైనా, “భారతీయ దళాలు ఒక ముఖ్యమైన చైనా సైనిక పోస్టును స్వాధీనం చేసుకున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) భారత భూభాగాన్ని ఆక్రమించడానికి చేసిన ప్రయత్నాన్ని భారత దళాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి” అని నివేదిక పేర్కొంది.





