
726views
చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది. షేక్ పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని సీఎం కేసీఆర్ గతంలో సూచించారు. సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్ లో స్థలం కేటాయించారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లో కేబీఆర్ పార్క్ ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల ఇంటి స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం కేటాయించింది. బుధవారం ఉదయం ఆ స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్ భార్యకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.





