News

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

535views

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాను అమరుడైయ్యారు. ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్స్‌, 182 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు కూడా షూటింగ్‌ ప్రారంభించారని, ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్‌ మృతిచెందారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. అక్కడ కొన్ని తుపాకులతో పాటు బులెట్లు, మందుగుండు సామాగ్రి దొరికినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.