
రాష్ట్రంలో అన్య మత వ్యాప్తి, ప్రచారాలకు సంబంధించిన వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా క్రైస్తవ మత ప్రచారంలో, ప్రార్థనలలో పాల్గొన్న సంఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా వలస కూలీల కోసం ఏర్పాటుచేసిన శిబిరంలో స్వయంగా డ్యూటీలో ఉన్న కానిస్టేబులే యూనిఫామ్ ధరించి మరీ క్రైస్తవ మత ప్రార్థనలు చేయించిన సంఘటన గుంటూరులో వెలుగు చూసింది.
వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కోసం లాక్డౌన్ నేపథ్యంలో గుంటూరులోని పలు ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. వాటిలోని అటు ఎస్పీ కార్యాలయానికి, జిల్లా కోర్ట్ కి, AP NGO భవాన్ కి సమీపంలో ఉండే ఒక వసతిలో ఉన్న వలస కూలీలచే డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ క్రైస్తవ మత ప్రార్థనలు చేయించిన సంఘటన నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
గుంటూరులో ఎస్పీ కార్యాలయం ప్రక్కనే వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో కానిస్టేబుల్ మతప్రచారం చేస్తూ మతమార్పిడులు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత ధైర్యంగా మతమార్పిడులు చేస్తే ఇంకా మిషనరీలు ఎంత మందిని మతమార్పిడులు చేస్తున్నారో…wake up Hindus..
Posted by మన హిందూధర్మం on Saturday, 30 May 2020
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రసార, సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవాలయాలు, హిందూ దేవాలయాల ఆస్తులపై దాడులు, క్రైస్తవ మత వ్యాప్తి, ప్రచారం విషయాలలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.





