బస్తర్ లో యేడాదిలోనే లొంగిపోయిన 300 మంది నక్సలైట్లు
మావోయిస్టులకు ప్రాబల్యమున్న బస్తర్ ప్రాంతంలో మావోలకు గత యేడాది కాలంగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు కాల్పుల్లో హతమవ్వడంతో లేదా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, లేదా నక్సలిజంలో వున్న పెడ ధోరణుల కారణంగా లొంగిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఒక్క యేడాదిలోనే 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా రెండు రోజుల క్రితం బస్తర్ లో 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏకంగా 8 లక్షల రివార్డు వున్న కీలక నక్సలైట్ సోను హేమ్లా అలియాస్ కరోటి కూడా లొంగిపోయాడు. మరో 20 మంది మావోయిస్టులపై 81 లక్షల సమష్టి రివార్డు వుంది. వీరు కూడా లొంగిపోయారు. తామంతా నక్సలిజం లో వున్న డొల్లతనం, అంతర్గత చీలికలు, సైద్ధాంతిక నిబద్ధత లేకపోవడం, చీలికలు, పేలికలు, గ్రూపిజం కారణంగానే విసుగు...








