జాతీయోద్యమ కెరటాలు నాటి తెలుగు పత్రికలు
భారత స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికలు గణనీయమైన పాత్ర పోషించాయి. ‘వందేమాతరం’ ఉద్యమం నుండి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం దాకా సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు స్వాతంత్య్ర ఉద్యమ బాటలో నడిచాయి. మొదట్లో మత పరమైన పత్రికలు తెలుగునేలపై ఆవిర్భవించాయి. వీరేశలింగం పంతులు...









